సుధీర్ బాబు కెరీర్లో బెస్ట్ ఓవర్సీస్ వసూళ్లు !

sammohanam

ప్రస్తుతం ప్రతి హీరో తెలుగు రాష్ట్రాల కలెక్షన్లతో పాటు ఓవర్సీస్ వసూళ్లపై కూడ ఎక్కువ శ్రద్ద చూపుతున్నారు. అందుకే అక్కడి తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు తమ సినిమాలు ఉండేలా చూసుకుంటున్నారు. ఆడియన్స్ కూడ సినిమా బాగుంటే చిన్న, పెద్ద అని తేడా లేకుండా ఆదరిస్తున్నారు. అందుకు తాజాగా విడుదలైన సుధేర్ బాబు ‘సమ్మోహనం’ చిత్రం మంచి ఉదాహరణ.

ప్రీమియర్ల ద్వారా 67,636 డాలర్లను రాబట్టిన ఈ సినిమా మొదటి రోజు 94,150 డాలర్లు, శనివారం 140,222 డాలర్లను అందుకుని మొత్తంగా 302,077డాలర్లను ఖాతాలో వేసుకుని సుధీర్ బాబు గత చిత్రం ‘భలే మంచిరోజు’ పేరు మీదున్న 132,921 డాలర్ల రికార్డుని బద్దలు కొట్టింది. మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు.

Exit mobile version