‘ఆటగదరా శివ’ విడుదల ఎప్పుడంటే !

aatagadara shiva

సినిమాలు తీయడంలో దర్శకుడు చంద్ర సిద్దార్థాది ప్రత్యేకమైన శైలి. సినిమాలంటే కమర్షియల్ అంశాలు ఒక్కటే కాదని నమ్మే ఈయన ‘ఆ నలుగురు, మధుమాసం, అందరి బంధువయా’ వంటి మంచి సినిమాల్ని ప్రేక్షకులకందించారు. చివరగా చేసిన ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ చిత్రం భారీ పరాజయాన్ని చవిచూడటంతో కొంత గ్యాప్ తీసుకున్న ఆయన ప్రస్తుతం ‘ఆటగదరా శివ’ అనే సినిమాను చేస్తున్నారు.

అన్ని పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమాను జూలై 14న విడుదలచేయనున్నారు. కొద్దిరోజుల క్రితమే విదులైన టీజర్, ట్రైలర్లకు కూడ మంచి స్పందన లభించింది. ‘భజరంగీ భాయీజాన్, లింగ’ వంటి సినిమాల్ని నిర్మించిన నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వాసుకి వైభవ్ సంగీతాన్ని అందించారు.

Exit mobile version