ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలి స్పెస్ మూవీగా తెరకెక్కిన చిత్రం ‘టిక్ టిక్ టిక్’. గత శక్రవారం విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. జయం రవి హీరోగా తెలుగులో తొలి సక్సెస్ ను అందుకున్నారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై లక్ష్మణ్ చదలవాడ, చదలవాడ పద్మావతి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.
దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ మాట్లాడుతూ.. ప్రేక్షకుల మీద నమ్మకంతో ఇలాంటి ఓ స్పెస్ ఫిలిం ను తీశాం. వారు మా నమ్మకాన్ని వమ్ము చెయలేదు. లక్ష్మణ్ గారు సినిమాను భారీగా విడుదల చెశారు. వారికి ధన్యవాదాలన్నారు.
జయం రవి మాట్లాడుతూ.. ఇదొక కొత్త ప్రయత్నం. సక్సెస్ చెసి మాకు ప్రేక్షకులు, క్రిటిక్స్ ఎంకరేజ్ చేసారు. తెలుగు సినిమా పరిశ్రమలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు ‘టిక్ టిక్ టిక్’ సక్సెస్ తో డబుల్ హ్యాపీగా ఉన్నాను. త్వరలో తెలుగు సినిమా కూడా చెస్తానన్నారు. ఈ సినిమా మేకింగ్ కొసం ఎంతో కష్టపడ్డాం. చిత్ర విజయం అదంతా మరిపోయేలా చేసింది. సిజి వర్క్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. మా నిర్మాతలు గట్స్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు అన్నారు.
లక్ష్మణ్ చదలవాడ మాట్లాడుతూ..’టిక్ టిక్ టిక్’ ప్రేక్షకుల విజయం. జెన్యూన్ మౌత్ టాక్ తో ఈ సినిమా ఆడుతోంది. సౌత్ ఇండియా నుంచి ఈ తరహా సినిమా రావటం మనందరికి గర్వకారణం. మా బ్యానర్లో వరుసగా మూడొ చిత్రాన్ని సక్సెస్ చెసిన ఆడియెన్స్ కు దన్యవాదాలని అన్నారు.
