గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ నటించిన చిత్రం ‘ధ్రువ నట్చత్తిరమ్’. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం అనివార్య కారణాలవల్ల వాయిదా పడుతూ వస్తుంది . ఇప్పుడు ఎట్టకేలకు ఈ సినిమా విడుదలకు సిద్దమవుతుంది. సినిమాకు సంబంధించిన పనులు చివరి దశకు చేరుకోవడంతో ఈ చిత్రం సెప్టెంబర్ మొదటి వారంలో ప్రేక్షకులముందుకు రానుంది . హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్స్ రాధికా, సిమ్రాన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు .ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ కి మంచి స్పందన లభించింది .
స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్నా ఈ చిత్రంలో రీతూ వర్మ ,ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటించారు . ఓండ్రగా ఎంటర్టైన్మెంట్స్ , ఎస్కేప్ మోషన్ పిక్చర్ సంస్థలు కలిసి ఈ సినిమాని నిర్మించిన ఈ చిత్రం తెలుగులో ఈ సినిమా ‘ధ్రువనక్షత్రం’గా రానుంది.
