మరోసారి ఏఎన్నార్ పాత్రలో నాగ చైతన్య ?

Naga Chaithanya

ఇటీవల విడుదలైన ‘మహానటి’ చిత్రంలో కొద్దిసేపు అక్కినేని నాగేశ్వరరావుగారి పాత్రను ధరించి అందరినీ మెప్పించాడు ఆయన మనువడు, యువ హీరో నాగ చైతన్య. ఇప్పుడు మళ్లీ చైతూ నాగేశ్వరరావుగారి పాత్రలో కనిపించనున్నారని ఫిల్మ్ నగర్ టాక్.

వివరాల్లోకి వెళితే నందమూరి బాలక్రిష్ణ చేయనున్న ‘ఎన్టీఆర్’ చిత్రంలో తారకరామారావుగారి సహచరుడు, తోటి నటుడు నాగేశ్వరరావుగారి పాత్ర కూడ ఉండనుందట. ఆ పాత్ర కోసం చైతన్యని సంప్రదించాలని భావిస్తున్నారట దర్శకుడు క్రిష్.

మరి క్రిష్ ఆఫర్ కు చైతన్య ఒప్పుకుని మరోసారి తాతగారి పాత్రలో అలరిస్తారో లేదో చూడాలి. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, యువ నిర్మాత విష్ణులు సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. జూలై 5వ తేదీ నుండి ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూట్ మొదలుకానుంది.

Exit mobile version