నిర్మాణానికి నితిన్‌ విరామం !

Nithin

నితిన్ వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న సమయంలో ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి ‘ఇష్క్‌, గుండెజారి గల్లంతయ్యిందే’ చిత్రాలను తమ సంస్థలోనే నిర్మించి ‘నితిన్’కు విజయాలను అందించారు. ఆ తర్వాత నితిన్ కొన్ని సినిమాలు చేసినా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అ ఆ’ చిత్రంతో భారీ విజయాన్నే అందుకున్నాడు. కానీ అఖిల్‌ చిత్రాన్ని నిర్మించి నష్టాలు చవిచూశారు. ఈ మద్య వచ్చిన ‘ఛల్‌ మోహన్‌ రంగ’ కూడా ఆశించిన ఫలితం ఇవ్వకపోయేసరికి ప్రస్తుతం నితిన్ నిర్మాణానికి విరామం ఇచ్చి వేరే నిర్మాతలకే సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు.

దిల్‌ రాజు బ్యానర్ లో చేస్తున్న ‘శ్రీనివాస కళ్యాణం’ త్వరలో పూర్తి కానుంది. అలాగే తన తర్వాత సినిమాలను కూడా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌కి, మైత్రి మూవీ మేకర్స్‌కి చేయనున్నాడు. డేట్లు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. సతీష్ వేగ్నేశ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శ్రీనివాస కళ్యాణం’ తనకు భారీ విజయాన్ని అందింస్తుందని నితిన్ నమ్మకంగా ఉన్నాడు. ప్రేక్షకుల్లో కూడా ఈ చిత్రం మీద మంచి అంచనాలే ఉన్నాయి.

Exit mobile version