యువ హీరో రాజ్ తరుణ్ కు ఈ ఏడాది రెండు సినిమాలు చేసినా ఒక్కటీ కలిసి రాలేదు. పైగా వాటి వలన రొటీన్ సినిమాలే చేస్తున్నారనే విమర్శలు కూడ అందుకోవాల్సి వచ్చింది. అందుకే ఈసారి ప్రేమ కథతో ప్రేక్షకుల్ని పలకరించనున్నారాయన. ఆయన చేసిన తాజా చిత్రం ‘లవర్’ జూలై 12న విడుదలకానుంది.
ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాల్లో ఉంది. రాజ్ తరుణ్ తన పాత్ర తాలూకు డబ్బింగ్ చెబుతున్నారు. త్వరలోనే ఈ పనులు ముగియనున్నాయి. ప్రముఖ బ్యానర్ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ ఫై దిల్ రాజు సమక్షంలో హర్షిత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సమీర్ రెడ్డి చాయాగ్రహణం అందిస్తున్నారు. రిద్దీ కుమార్ కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి అంకిత్ తివారి, ఆర్కో, రిషి రిచ్, అజయ్ వాస్, సాయి కార్తీక్, తనిష్క్ బాగ్చిలు సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే విడుదలైన పాటలకు మంచి స్పంద కూడ దక్కుతోంది.
