ఎన్టీఆర్ బయోపిక్ లో మోహన్ బాబు?

mohan babu
బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని లాంచ్ చేసినప్పటి దగ్గరి నుండి ఈ చిత్రం తరుచూ వార్తల్లో నిలుస్తుంది . ఇంకా షూటింగ్ కూడా మొదలు కాకముందే ఈ చిత్రంలో ఎవరెవరు నటించనున్నారో నని పెద్ద చర్చ జరుగుతుంది .దాంట్లో భాగంగానే ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వర్ రావు పాత్రలో నాగ చైతన్య మరోసారి నటించన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇప్పుడు తాజాగా విలక్షణ నటుడు మోహన్ బాబు కూడా ఒక పాత్రలో నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి ఎన్టీఆర్ తో మోహన్ బాబు కు మంచి అనుభందం వుంది దాంతో బాలకృష్ణ ఈ చిత్రంలో ఒక పాత్ర కోసం మోహన్ బాబు ని ఎంపిక చేసే అవకాశం ఉందని సమాచారం . ఇక ఇటీవల ఆయన సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన మహనటి చిత్రంలో ఎస్ వి రంగా రావు గారి పాత్రలో నటించారు .

Exit mobile version