50 రోజులు పూర్తిచేసుకున్న ‘మహానటి’ !

mahanati9

ఈ ఏడాదిలో తెలుగు పరిశ్రమ అందుకున్న భారీ విజయాల్లో ‘మహానటి’ కూడ ఒకటి. నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈరోజుటితో 50 రోజుల రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.70 కోట్ల గ్రాస్ ను రాబట్టుకుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో ఇంత పెద్ద మొత్తంలో వసూళ్లు సాధించిన చిత్రంగా ‘మహానటి’ రికార్డ్ క్రియేట్ చేసింది.

ఇక ఓవర్సీస్లో అయితే రెండున్నర మిలియన్లకు పైగా రాబట్టుకుంది ఈ సినిమా. అలనాటి నటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించగా ఆమె నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఈ సినిమాతో మరోసారి తన ఉనికిని ఘనంగా చాటుకుంది.

Exit mobile version