టాకీ పార్ట్ ను పూర్తి చేసుకోనున్న నాగశౌర్య ‘నర్తన శాల’

Naga Shaurya2
ఛలో సినిమాతో భారీ విజయం సాధించిన తరువాత ఇటీవల అమ్మమ్మగారిల్లు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగశౌర్య కు ఈ చిత్రం విజయాన్ని అందించలేకపోయింది . ఇక ఇప్పుడు ప్రస్తుతం ఆయన నూతన దర్శకుడు శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ‘నర్తన శాల’ అనే చిత్రంలో నటిస్తున్నాడు . యామిని భాస్కర్ , కశ్మీర ప్రదేశి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నాగ శౌర్య సొంత బ్యానర్ ఐర క్రియేషన్స్ నిర్మిస్తుంది.

ప్రస్తుతం ఈచిత్రం కొద్దీ రోజుల్లో టాకీ పార్ట్ ను పూర్తిచేసుకోనుంది . తరువాత చిత్ర యూనిట్ పాటల చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్లనుంది . అక్కడ జరుగనున్న షెడ్యూల్ తో సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుంది. మహతి సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆగష్టు లో విడుదలయ్యే అవకాశాలు వున్నాయి.

Exit mobile version