
అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన ‘రుద్రమదేవి’ ‘భాగమతి’ చిత్రాలు మంచి విజయాలు సాధించినప్పటికీ ఆ తర్వాత అనుష్క మరో చిత్రం ఏది ఒప్పుకోలేదు. కారణం ఈ ఏడాది చివర్లో అనుష్క పెళ్లిచేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో గత రెండు సంవత్సరాల నుంచి హల్ చల్ చేస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే భాగమతి చిత్ర ప్రమోషన్ లోనే అనుష్క దర్శకుడు గౌతమ్‌మీనన్ చిత్రంలో నటించడానికి అంగీకరించానని మీడియా ముందే చెప్పారు.
ఆ మధ్య గౌతమ్‌మీనన్ కూడా నా సినిమాలో అనుష్క నటిస్తోందని ప్రకటించారు. ఐతే ఆ చిత్రం ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించట్లేదు. ప్రస్తుతం గౌతమ్‌మీనన్ విక్రమ్ హీరోగా ధ్రువనక్షత్రం, ధనుష్ తో ఎన్నైనోకి పాయు తూట్టా చిత్రాలను తెరకెక్కించే పనుల్లో ఉన్నాడు. పైగా తన తర్వాత చిత్రం శింబుతో ఉంటుందని ఇటీవలే ప్రకటించారు. దీంతో గౌతమ్‌మీనన్ చిత్రం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న అనుష్క ఇంకా వేచి చూస్తూ ఉండకోకూడదనే నిర్ణయానికి వచ్చిందన్నట్లు తెలుస్తోంది.