ప్రమోషన్లు బాగున్నాయి.. మరి ఫలితం ఎలా ఉంటుందో !

Pantham Tej I Love U

ఈ వారాంతంలో రెండు సినిమాలు విడుదలకానున్నాయి దాంట్లో మొదటగా గోపిచంద్ నటించిన ‘పంతం’ చిత్రం జులై 5 న ప్రేక్షకులముందుకు రానుంది . ఈ చిత్ర విజయం ఫై ధీమాగా ఉన్నాడు గోపి . అందుకే ఎన్నడూ లేనంతంగా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నాడు పైగా ఇది ఆయనకు 25వ చిత్రం కూడా. మంచి సోషల్ కాజ్ తో నూతన దర్శకుడు చక్రి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని
సత్యసాయి ఆర్ట్స్ పతాకంఫై కే కే రాధామోహన్ నిర్మించారు . ఈ చిత్రంలో గోపీచంద్ కు జోడిగా మెహ్రీన్ నటించింది .

ఇక రెండవ చిత్రం యువ హీరో సాయి ధరమ్ నటించినా’ తేజ్ ఐ లవ్ యు’. కరుణాకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కూడా భాగానే ప్రమోట్ చేస్తున్నారు చిత్ర యూనిట్. కొద్దీ నిమిషాల క్రితమే ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను జరిపారు . ఈచిత్రంలో తేజు సరసన అనుపమ నటించింది . క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ ఫై కే ఎస్ రామారావు నిర్మించిన ఈ చిత్రం జులై 6న ప్రేక్షకులముందుకు రానుంది. మరి ఈ రెండు చిత్రాలు కూడా మంచి విజయాన్ని సాధించి హీరోలు గోపీచంద్ , తేజులను మళ్ళి సక్సెస్ ట్రాక్ ఎక్కించాలని ఆశిద్దాం.

Exit mobile version