అడివి శేష్ , శోభిత దూళిపాళ్ల జంటగా నూతన దర్శకుడు శశి కిరణ్ టిక్క తెరకెక్కిస్తున్న చిత్రం’ గూఢచారి’. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమవుతుంది . స్పై త్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్ జులై 4న విడుదలకానుంది. ఇక ఈచిత్రానికి హీరో అడివి శేష్ కథను అందించడం విశేషం.
సుప్రియ యార్లగడ్డ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు . అభిషేక్ పిక్చర్స్ పతాకం ఫై అభిషేక్ నామ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగష్టు 3 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
