‘శూర్పణక’గా చందమామ నటించనుందట ?

kajal2

చందమామ చిత్రంతో సక్సెస్ అందుకున్న కాజల్ ఆ తర్వాత మగధీరలో యువరాణి పాత్ర పోషించి మంచి క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత అలాంటి యువరాణి పాత్రలో కాజల్ కనిపించనుందని తెలుస్తోంది. మన దేశంలో రామాయణానికి ఎంతో గొప్ప ప్రాధాన్యత ఉంది. అందులో ముఖ్యంగా లంకాధిపతి రావణాసురుడు లేకపోతే అసలు రామాయణమే లేదు.

మరి అలాంటి రావణాసురుడిని రాముని పై ఉసిగొల్పి రామ రావణ యుద్దానికి ప్రధాన కారణమైన వ్యక్తి శూర్పణక. ఆమె గురించి రావణ సోదరి అని ఓ రాక్షసి అని తప్ప పెద్దగా ఎవ్వరికి తెలియదు. కానీ శూర్పణక ఓ అందమైన యువరాణి అట. ఇప్పుడు ఆ పాత్రను చందమామ కాజల్ పోషించనున్నట్లు సినీవర్గాల నుండి సమాచారం అందుతుంది. ఈ చిత్రాన్ని భార్గవ్ అనే దర్శకుడు తెరకెక్కించబోతున్నాడు. ఐతే ఈ చిత్రానికి సంబంధించి అన్ని విషయాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.

Exit mobile version