ఆసిన్ మూవీ క్రెయేషన్స్ పతాకంపై విరాట్ కొండూరు మరియు సిమ్రాత్ కౌర్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీకాంత్ చిన్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పరిచయం. నేడు ఈ చిత్ర ట్రైలర్ ని యంగ్ హీరో నితిన్ కొద్దీ సేపటి క్రితం ఆవిష్కరించి చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ట్రైలర్ మంచి ఇంప్రెస్సివ్ గా వుంది. ట్రైలర్ చూస్తుంటే వైవిద్యమైన ఒక ప్రేమకథ తో తెరకెక్కినట్లు గా తెలుస్తోంది. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, పృథ్వి రాజ్, పరుచూరి వెంకటేశ్వర రావు తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది అలాగే విజువల్స్ కూడా భాగా ఆకట్టుకున్నాయి. మొత్తంగా ఒక డిఫరెంట్ ప్రేమకథగా రాబోతున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది.
ట్రైలర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
