ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు మేకర్స్. అట్లీ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్న #AA22 క్రేజీ ప్రాజెక్ట్‌కి ‘రాక’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో అల్లు అర్జున్ మునుపెన్నడూ చూడని అత్యంత భయంకరమైన అవతారంలో కనిపిస్తున్నాడు. ఒక మనిషి జంతువుగా మారే ‘వేర్-బీస్ట్’ కాన్సెప్ట్‌తో ఈ లుక్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. బన్నీ రగ్గడ్ లుక్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికి పెంచేసింది.
తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు, అల్లు అర్జున్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ తోడవడంతో ‘రాక’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమనిపిస్తోంది. ఐకాన్ స్టార్ 44వ పుట్టినరోజు వేళ విడుదలైన ఈ అప్డేట్తో సోషల్ మీడియాలో ‘రాక’ మేనియా ఊపేస్తోంది. అల్లు అర్జున్ కెరీర్లోనే ఇది అత్యంత ప్రయోగాత్మక చిత్రంగా నిలవనుంది.
