బుల్లితెరపై సందడి చేయనున్న స్టార్ హీరో !

vishal1

తమిళ హీరో విశాల్ ఇటీవల ‘అభిమన్యుడు’ చిత్రంతో తిరుగుగులేని విజయాన్ని అందుకొని ఫుల్ జోష్ లో వున్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన ‘పందెంకోడి 2’ విడుదలకు సిద్దమవుతుంది. ఈసినిమాతోపాటు ఆయన ‘టెంపర్’ రీమేక్ లో నటిస్తున్నారు. మోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రానికి ‘అయోగ్య’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలకానుంది ఈచిత్రం.

ఇక సినిమాలోతోనే కాకుండా ఇప్పుడు తాజాగా బుల్లితెర ఫై సందడి చేయనున్నాడు విశాల్. ప్రముఖ టీవీ ఛానల్ సన్ టీవీ నిర్వహిస్తున్న ఒక షో కి విశాల్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ షో త్వరలోనే ప్రసారం కానుంది.

Exit mobile version