ఆ డైరెక్టర్‌తో అల్లు అర్జున్ సూపర్ హీరో మూవీ..?

Allu-Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులను తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే దర్శకుడు అట్లీ డైరెక్షన్‌లో AA22 చిత్రంలో నటిస్తున్నాడు బన్నీ. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, పోస్టర్‌ను బన్నీ బర్త్ డే ట్రీట్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమా తర్వాత దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో AA23 అనే ప్రాజెక్ట్‌ను ఇప్పటికే ప్రకటించాడు.

ఇక ఇప్పుడు మలయాళ యాక్టర్ కమ్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో బన్నీ ఓ సినిమా చేయబోతున్నాడట. ఈ సినిమాను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని చిత్ర వర్గాల టాక్. ఈ సినిమా కోసం బాసిల్ జోసెఫ్ స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నాడని.. ఈ చిత్రాన్ని ఓ సూపర్ హీరో మూవీగా ఆయన రూపొందించనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఇప్పటికే బాసిల్ గీతా ఆర్ట్స్ నుంచి అడ్వాన్స్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే, ఈ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ కెరీర్‌లో 25వ చిత్రంగా రాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో బన్నీని మునుపెన్నడూ చూడని విధంగా ప్రెజెంట్ చేయబోతున్నారట. ఇక ఈ సినిమాను అధికారికంగా ప్రకటించిన తర్వాత అల్లు అర్జున్ కెరీర్‌లోని 24వ చిత్రాన్ని ఎవరితో చేయబోతున్నాడనే విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సినీ సర్కిల్స్‌లో చర్చ సాగుతోంది.

Exit mobile version