గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం ‘ఎన్నై నోకి పాయుమ్ తొట్ట’. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆర్థిక సమస్యలు కారణంగా విడుదలకు నోచుకోలేదు. తాజాగా చెన్నై చిత్ర వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం ఈచిత్రం విడుదలకు అన్ని అడ్డంకులు తొలిగిపోయి చిత్ర థియేట్రికల్ హక్కులను ఒక ప్రముఖ సంస్థ దక్కించుకుందట. త్వరలోనే ఈ చిత్రం యొక్క విడుదల తేదీ ని అధికారికంగా ప్రకటించనున్నారు.
మెగా ఆకాష్ కథానాయికగా నటించిన ఈచిత్రంలో శశి కుమార్ ముఖ్య పాత్రలో నటించారు. శివ సంగీతం అందించిన ఈచిత్రానికి గౌతమ్ మీనన్ నిర్మాత. ఇక ఈ చిత్రం తో పాటు ధనుష్ నటించిన ‘మారి 2’ కూడా విడుదలకు సిద్దమవుతుంది.
