మన టాలీవుడ్ నుంచి ఉన్నటువంటి అతి తక్కువ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు వివి వినాయక్ కాంబినేషన్లో చేసిన సూపర్ హిట్ చిత్రం అదుర్స్ కూడా ఒకటి. ఎన్టీఆర్ డబుల్ రోల్, బ్రహ్మీ కామెడి సాలిడ్ కథలు ఈ సినిమాలో హైలైట్ గా నిలిచి ఇప్పటికీ ఒక ఎవర్ గ్రీన్ ఎంటర్టైనర్ గా నిలిచాయి. అయితే దీనికి సీక్వెల్ ఉంటుంది అని రచయిత కోన వెంకట్ ఆ మధ్య తెలిపారు.
కానీ దీనిపై దర్శకుడు వినాయక్ మాట మాత్రం మరోలా ఉంది.. లేటెస్ట్ గా తన స్టేట్మెంట్ వైరల్ గా మారింది. కొన్నింటిని టచ్ చెయ్యకుండా ఉంటేనే బెటర్ అని ఇప్పుడు ఒకవేళ సీక్వెల్ తీసినా అది ఫోర్స్డ్ గానే వుంటుంది అని రీసెంట్ ఇంటరాక్షన్ లో తను కితాబిచ్చారు. సో తను మాత్రం అదుర్స్ సీక్వెల్ పట్ల ప్రస్తుతం ట్రెండ్ విషయంలో క్లారిటీ గానే ఉన్నారని చెప్పొచ్చు.
