‘విజేత’ చిత్రం తో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్. ఇటీవల విడుదలైన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. ఇక ఈచిత్రం తరువాత కొంత గ్యాప్ తీసుకొని ఆయన తన రెండవ చిత్రంలో నటించడానికి సిద్దమవుతున్నాడు . పులి వాసు తెరకెక్కించనున్న ఈ చిత్రంలో కళ్యాణ్ కొత్త లుక్ లో కనిపించనున్నాడు. అలాగే ఈ చిత్రం కోసం ఆయన ప్రత్యేకంగా కొన్ని విభాగాల్లో శిక్షణ కూడా తీసుకుంటున్నారట.
రాజేంద్ర ప్రసాద్ , నరేష్ వీకే ముఖ్య పాత్రల్లో నటించనున్న ఈ చిత్రాన్ని రిజ్వాన్ ఎంటెర్టైనెర్మెంట్స్ నిర్మించనుంది. తమన్ సంగీతం అందించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.
