‘పెటా’కు కూడా అదే ఆడియో వేదిక !

petta1

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న 165 వచిత్రం ‘పెటా’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక ఈచిత్రం యొక్కఆడియో విడుదల వేడుక డిసెంబర్ 9న జరుగనుందని తెలిసిందే. ఈ ఈవెంట్ చెన్నై లోని శ్రీ సాయి రామ్ ఇంజినీరింగ్ కళాశాలలోని ది లియో ముత్తు ఆడిటోరియం లో జరుగనుంది. ఇంతకుముందు విజయ్ నటించిన ‘సర్కార్’ చిత్రం యొక్క ఆడియో వేడుక కుడా ఇదే వేదిక మీద జరిగింది. దాంతో ఈ పెటా కు కూడా అదే వేదిక ను పరిశీలిస్తున్నారు చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్.

కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నవాజుద్దిన్ సిద్దిఖీ , విజయ్ సేతుపతి , సిమ్రాన్ , త్రిష , మెగా ఆకాష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుద్ రవి చంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో పొంగల్ కానుకగా విడుదలకానుంది.

Exit mobile version