బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ సింబా’ విడుదలకు సిద్దమైంది. ఈచిత్రం ఈ నెల 28నదాదాపుగా 3000 స్క్రీన్ లలో సందడి చేయనుంది. ఇటీవల షారుఖ్ నటించిన ‘జీరో’ కు నెగిటివ్ టాక్ రావడంతో ఈ చిత్రాన్ని తీసేసి సింబా ను ఆడించడానికి రెడీ అవుతున్నారు. దాంతో ఈ చిత్రానికి భారీ స్థాయిలో థియేటర్లు దొరికాయని సమాచారం.
ఇక తెలుగు సూపర్ హిట్ మూవీ ‘టెంపర్’ చిత్రానికి రీమేక్ గా వస్తుండడంతో ఈ చిత్రం ఫై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇటీవల విడుదలైన ఈ ట్రైలర్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఎన్టీఆర్ చేసిన పాత్రలో రణ్వీర్ ను ఊహించుకోలేకపోయారు. మరి ఈ చిత్రం అక్కడ ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందో చూడాలి.
రోహిత్ శెట్టి తెరకెక్కించిన ఈచిత్రంలో సారా అలీ ఖాన్ కథానాయికగా నటించింది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని కరణ్ జోహార్, రోహిత్ శెట్టి సంయుక్తంగా నిర్మించారు.
