
సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన గత చిత్రాలు తెలుగులో నిరాశపరిచాయి. లాభాలు రావడం ఏమో కాని కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కు తీసుకురాలేకపోయాయి. అయితే ఇటీవల ‘2.0’ పర్వాలేదనిపించినా తెలుగు హక్కులు భారీ రేట్ కు అమ్మడంతో లాభాలు తీసుకరాలేకపాయింది.
ఇక ఇప్పుడు రజినీ మరో చిత్రం తో తెలుగు ప్రేక్షకులముందుకు వస్తున్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం ‘పేట’ సంక్రాంతికి కానుకగా జనవరి 10న విడుదలకానుంది. అయితే పండుగ సీజన్ టాలీవుడ్ కు చాలా కీలకం అందులో భాగంగా మూడు పెద్ద సినిమాలు రిలీజ్ కు రెడీ గా వున్నాయి. మరి ఈలాంటి టైం లో రజినీ సినిమాను థియేటర్లలో దించడం రిస్క్ తో కూడుకున్న పనే.
ఈ చిత్రానికి సరిగ్గా ఒక్క రోజు ముందు ఎన్టీఆర్ కథానాయకుడు విడుదలకానుంది. ఎన్టీఆర్ బయోపిక్ కావడం వల్ల ఇప్పటికే ఈచిత్రం ఫై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఆ తరువాత మూడు రోజుల వ్యవధిలో వినయ విధేయ రామ , ఎఫ్ 2 థియేటర్లకు క్యూ కట్టనున్నాయి. మరి ఇన్ని పెద్ద సినిమాల నడుమపేటకు ఎలాంటి ప్రేక్షాదరణ వస్తుందో చూడాలి.