హీరోయిన్ని పెళ్లి చేసుకోబోతున్న నటుడు !

noel

‘కుమారి 21 ఎఫ్’ సినిమాలో కీలక పాత్రలో కనిపించిన నటుడు మరియు సింగర్ నోయెల్ త్వరలో ఓ హీరోయిన్ని పెళ్లి చేసుకోబోతున్నాడట. తేజ దర్శకత్వం వహించిన ‘1000 అబద్దాలు’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ ఎస్తేర్ నొరోన్హా. ఆ తరువాత భీమవరం బుల్లోడు, జయ జానకి నాయక వంటి చిత్రాల్లో ఎస్తేర్ నొరోన్హా నటించింది, అయినా ఆమెకి పెద్దగా గుర్తింపు రాలేదు. అవకాశాలూ రాలేదు.

కాగా ఎస్తేర్ నొరోన్హా మంగలూర్ కు చెందిన కొంకణి అమ్మాయి. ఆమెకు భరతనాట్యంతో పాటు పాటలు కూడా పాడుతుందట. మొత్తానికి నోయెల్ – ఎస్తేర్ ఓ ఇంటి వారు కాబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగి ఇప్పటికే చాలా కాలం అయిందట.

Exit mobile version