క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా ఆయన బయోపిక్ పార్ట్స్ లో మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ జనవరి 9న విడుదల కానున్న విషయం తెలిసిందే. కాగా మొత్తం చిత్రబృందం ఎన్టీఆర్ పుట్టి పెరిగిన నిమ్మకూరుకి ప్రయాణం కానుంది. నిమ్మకూరులోనే తమ చిత్ర మొదటి విజయోత్సవ యాత్రను ప్రారంభించాలని బాలయ్య నిర్ణయించారట.
ఇక ఇప్పటికే కథానాయకుడు ప్రమోషన్స్ ను చిత్రబృందం వేగవంతం చేసింది. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ బయోపిక్లో రెండో పార్ట్ ‘మహానాయకుడు’ను పిబ్రవరి 7న విడుదల చేయనున్నారు. ఎన్ బి కె ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్ ,విబ్రి మీడియా సంయుక్తంగా ఈ బయోపిక్ ను నిర్మిస్తున్నాయి.
