‘నటసామ్రాట్’ వచ్చే నెల నుండి మొదలు కానున్నాడు !

krishna vamsi

టాలీవుడ్ లో తనకంటూ ఓ క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ‘కృష్ణ వంశీ’ గత కొన్ని సినిమాలుగా బాక్సాఫీస్ వద్ద వరుస పరాజయాలతో సతమవుతున్నాడు. దాంతో ఈ సారి కృష్ణ వంశీ ప్రముఖ నటుడు నానా పటేకర్ ప్రధాన పాత్రగా మరాఠీలో రూపొంది మంచి విజయం సాధించిన ‘నటసామ్రాట్’ న నమ్ముకున్న విషయం తెలిసిందే.

కాగా నానా పటేకర్ పాత్రలో ప్రకాష్ రాజ్ నటించనున్నాడు. ఇప్పటికే కృష్ణ వంశీ ‘నటసామ్రాట్’ స్క్రిప్ట్ లో తెలుగుకు తగ్గట్లు మార్పులు చేర్పులు కూడా పూర్తి చేశారు. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ ను కూడా మొదలు పెట్టడానికి కృష్ణ వంశీ తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఈ రీమేక్ తోనైనా ఈ క్రియేటివ్ డైరెక్టర్ మళ్ళీ ఫామ్ లోకి వస్తారేమో చూడాలి.

Exit mobile version