రాహుల్ విజయ్ హీరోగా, మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా ప్రణీత్ బ్రామ్మడపల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సూర్యకాంతం’. కాగా ఈ చిత్రం టీజర్ ను జనవరి 25వ తేదీన సాయంత్రం 5 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది.
రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత సందీప్ ఎర్రమరెడ్డి నిర్మిస్తున్నారు. రాబిన్ మార్క్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. అలాగే ఈ చిత్రాన్ని మార్చిలో విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
