‘కవచం’ తరువాత యువహీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , కాజల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సీత’. తేజ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో టైటిల్ రోల్ లో కాజల్ నటిస్తుండగా రామ్ పాత్రలో సాయి శ్రీనివాస్ నటిస్తున్నాడు. కథ అంత హీరోయిన్ చుట్టూనే తిరుగుతుందట. ఈచిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను రేపు విడుదలచేయనున్నారు. మరి కవచం తో హిట్ అందుకోలేకపోయిన ఈ జంట ఈ చిత్రం తోనైనా విజయాన్ని అందుకుంటారోలేదో చూడాలి.
ఏకే ఎంటర్టైమెంట్స్ పతాకం ఫై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈచిత్రాన్ని ఫిబ్రవరి లో విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ చిత్రం తరువాత సాయి శ్రీనివాస్ కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘రట్సాసన్’ రిమేక్ లో నటించాడనున్నాడని వార్తలు వస్తున్నాయి. ‘రైడ్ , వీర’ ఫేమ్ రమేష్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారట.
