మిస్టర్ మజ్ను మొదటి రోజు కలక్షన్ల వివరాలు !

MrMajnu

యువ హీరో అఖిల్ అక్కినేని నటించిన మూడవ చిత్రం మిస్టర్ మజ్ను మంచి అంచనాల మధ్య నిన్న విడుదలై మిక్సడ్ రివ్యూస్ ను రాబట్టుకుంది. ఇక మొదటి రోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 4.3 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. అఖిల్ గత చిత్రాలతో ఓపెనింగ్స్ తో పోలిస్తే ఈచిత్రానికి తక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే ఈ రోజు సెలవు దినం కావడం వల్ల కలెక్షన్స్ పెరిగే అవకాశం వుంది.

ఇక ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 3.24కోట్ల షేర్ ను రాబట్టింది. వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటించింది.

తెలంగాణ &ఏపీ లో మొదటిరోజు కలెక్షన్ల వివరాలు :

ఏరియా కలక్షన్స్
నైజాం 1.08 కోట్లు
సీడెడ్ 0.48లక్షలు
నెల్లూరు 0.12లక్షలు
గుంటూరు 0. 54లక్షలు
కృష్ణా 0.25 లక్షలు
పశ్చిమ గోదావరి 0.17లక్షలు
తూర్పు గోదావరి 0.20లక్షలు
ఉత్తరాంధ్ర 0.40లక్షలు
మొత్తం 3. 24 కోట్లు
Exit mobile version