‘రామ్’తో అఖిల్ హీరోయిన్ కన్ఫర్మే !

nidhi

మొత్తానికి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, తను ప్రస్తుతం తీస్తున్న ‘ఇస్మాట్ శంకర్’లో రామ్ సరసన నటించే హీరోయిన్ని ఫైనల్ చేసి పోస్టర్ ను కూడా విడుదల చేశాడు. ఈ సినిమాలో ఎనర్జిటిక్ హీరో రామ్ కి జోడి కోసం గత కొన్ని రోజులుగా పూరి తెగ వెతుకుతూ.. చివరికి నిధి అగర్వాల్ ను ఫైనల్ చేశాడు. ఈ మేరకు చిత్రబృందం నుండి అధికారిక ప్రకటన కూడా వదిలాడు.

ఇక ఈ చిత్రంలో మరో హీరోయిన్ నభా నటేష్ కూడా నటించనుందని తెలుస్తోంది. ఇటీవలే మొదలైన ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ చిత్రంలో రామ్ న్యూ లుక్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించనుండగా ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ రాజ్ తోట సినిమాటోగ్రఫీని అందించనున్నారు. పక్కా యాక్షన్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ‘మే’లో ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.

Exit mobile version