సూపర్ స్టార్ మహేష్ బాబు ఏషియన్ సినిమాస్ సంస్థతో కలిసి హైదరాబాద్ లోని గచ్చిబౌలి లో ‘ఏ ఎమ్ బి సినిమాస్’ను గ్రాండ్ గా నిర్మించిన విషయం తెలిసిందే. ఏకంగా ఏడు స్క్రీన్స్ తో 1638 సీటింగ్ కెపాసిటీతో దాదాపు 79 కోట్లతో ఈ మల్టీ ఫ్లెక్స్ ను నిర్మించినట్లు తెలుస్తోంది. అందుకేనేమో ఈ మల్టీ ఫ్లెక్స్ ను
సందర్శిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఉందని ప్రశంసిస్తున్నారు.
కాగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి, తన బావమరిది అల్లు అరవింద్ తో కలిసి రీసెంట్ గా ‘ఏ ఎమ్ బి సినిమాస్’కి వెళ్లారు. అందులో సినిమా చూసిన మెగాస్టార్ ఈ మల్టీ ఫ్లెక్స్ లో సినిమా చూడటం చాలా బాగుందని, ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయని, అలాగే సౌండ్ ఎఫెక్ట్స్, స్క్రీనింగ్ క్వాలిటీ చాలా అద్భుతంగా ఉన్నాయని మెచ్చుకున్నారు.
