ఉస్తాద్ మూవీ పై మెగాస్టార్ రియాక్షన్.. ఫ్యామిలీ మొత్తం ఖుషీ..!

Chiranjeevi

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటించారు. సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతున్న తరుణంలో, చిత్ర యూనిట్ అభిమానుల కోసం ఒక అదిరిపోయే సర్ప్రైజ్‌ను పంచుకుంది.

​హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్ర ప్రత్యేక ప్రదర్శనకు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా హాజరయ్యారు. చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్, సురేఖమ్మ, అన్నా లెజ్నెవా మరియు ఇతర కుటుంబ సభ్యులు ఈ వేడుకలో సందడి చేశారు. తన తమ్ముడి నటనను చిరంజీవి ఎంతో ఆస్వాదిస్తుండగా, తెరపై అన్నయ్య పాటలకు తాను వేసిన స్టెప్పులను చూసి పవన్ కల్యాణ్ కాస్త సిగ్గుపడుతున్న వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

​ఈ స్పెషల్ స్క్రీనింగ్‌లో నటి శ్రీలీల, నిర్మాత రవిశంకర్, దర్శకుడు అనిల్ రావిపూడితో పాటు పవన్ కల్యాణ్ ఆప్తమిత్రుడు ఆనంద్ సాయి, ఆయన భార్య వాసుకి కూడా పాల్గొన్నారు. మెగా బ్రదర్స్ ఇద్దరినీ ఇలా ఒకే ఫ్రేమ్‌లో చూడటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీనికి సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

Exit mobile version