షూటింగ్ పూర్తి చేసుకున్న జెర్సీ !

jersy Nani
‘మళ్ళీరావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న జెర్సీ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. క్రికెట్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని ,అర్జున్ పాత్రలో మిడిల్ ఏజ్డ్ క్రికెటర్ గా కనిపించనున్నాడు. ఇక ఈ చిత్రం లోని మొదటి పాట ను ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సితార ఎంటెర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈచిత్రంలో నాని సరసన కన్నడ నటి శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఇదిలాఉంటే ఈచిత్రానికి భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ లో విడుదలకానుంది.

ఇక గతఏడాది కృష్ణార్జున యుద్ధం , దేవదాస్ లతో వరుస పరాజయాలను చవి చూసిన నాని ఈ జెర్సీ తో హిట్ కొట్టి మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.

Exit mobile version