డియర్ కామ్రేడ్ నుండి మొదటి సాంగ్ విడుదల !

kamred1

గీత గోవిందం తరువాత విజయ్ దేవరకొండ , రష్మిక రెండవ సారి జంటగా నటిస్తున్న చిత్రం డియర్ కామ్రేడ్. ఇటీవల ఈచిత్రం యొక్క టీజర్ విడుదలకాగా తాజాగా ఈ చిత్రం లోని మొదటి సాంగ్ ‘నీ నీలి కన్నుల్లో’ కొద్దీ సేపటి క్రితం విడుదలైయింది. ఇక సాంగ్ చాలా ప్లెసెంట్ గా వుంది. తమిళ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ స్వరాలూ సమకూర్చిన ఈ సాంగ్ ను గౌతమ్ భరధ్వాజ్ పాడారు. ఇక ఈ సాంగ్ తెలుగు తో పాటు కన్నడ,మలయాళ, తమిళ భాషల్లో కూడా విడుదలైయింది.

భరత్ కమ్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ , బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మే 31న అన్ని సౌత్ భాషల్లో విడుదలకానుంది.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version