‘గరుడ వేగ’ తరువాత గ్యాప్ తీసుకున్న సీనియర్ హీరో రాజశేఖర్ ప్రస్తుతం ‘కల్కి’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ‘అవె’ ఫేమ్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. అందులో భాగంగా రాజశేఖర్ ఈచిత్రం యొక్క షూటింగ్ ను పూర్తి చేశాడు. ఇక నిన్న విడుదలైన ఈ చిత్రం యొక్క టీజర్ 24గంటల్లో 10లక్షలవ్యూస్ ను రాబట్టి మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఈటీజర్ సినిమా ఫై అంచనాలను పెంచింది.
వాస్తవిక సంఘటనలు ను బేస్ చేసుకొని యాక్షన్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నందిత శ్వేతా , ఆదా శర్మ , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.
