శర్వానంద్ , సమంత జంటగా కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ’96’ తెలుగు రీమేక్‌లో నటించనున్నారని తెలిసిందే. ఇటీవలే ఈచిత్రం లాంచ్ అయ్యింది. ఇక ఈ చిత్రం యొక్క రెగ్యులర్ ఈ నెల చివరి వారంలో కెన్యా లో ప్రారంభం కానుందని సమాచారం.
ఒరిజినల్ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ఈ రీమేక్ కి దర్శకుడు. తెలుగు నేటివిటీ కి తగ్గట్లుగా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేశారు.
రొమాంటిక్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి జాను అనే టైటిల్ ప్రచారం లో వుంది. గోవింద్ వసంత సంగీతం అందించనున్నాడు. ఆగస్టు చివర్లో ఈ చిత్రం విడుదలకానుంది.
