బిగ్ బాస్3 కి వ్యతిరేకంగా పిటిషన్,సందిగ్ధంలో ప్రసారం.

bigboos3

గత కొద్దిరోజులుగా బిగ్ బాస్ రియాలిటీ షో నిర్వాహకులపై నటి శ్వేతా రెడ్డి,అలాగే గాయత్రీ గుప్తాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. షోలో కి ఎంపికయ్యారు అని నమ్మించి, చివరకు లైంగిక వేధింపులకు గురిచేశారని పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయడం జరిగింది. ఇది చాలదన్నట్టు దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి బిగ్ బాస్ షో ప్రదర్శన నిలిపివేయాలంటూ తెలంగాణా హై కోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేయడం జరిగింది.

ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ పిటిషన్ లో ప్రతివాదిగా షో వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న అక్కినేని నాగార్జున పేరు చేర్చారు. ఆయన తో పాటు ఈ షో నిర్వహణతో సంబంధం ఉన్న మరో 10 మంది వ్యక్తులను ప్రతివాదులుగా చేర్చడం జరిగింది. ఈ షో నిర్వాణ ముసుగులో ఆడవారిని లైగింక వేదింపులకు గురిచేస్తున్నారని,ఆవకాశం ఇప్పిస్తామని వారి పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. ఇందుకు నిదర్శనంగా శ్వేతా రెడ్డి,గాయత్రీ గుప్తా సంఘటనలు ఉదహరించడం జరిగింది.

దీంతో ఈనెల 21న ప్రారంభం కావాల్సిన బిగ్ బాస్ 3 సందిగ్ధంలో పడింది. ఒకవేళ ఈ పిటిషన్ పై స్పందించిన హై కోర్ట్ ఈ షో కి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినట్లయితే షో ప్రసారం వాయిదా పడే అవకాశం కలదు. ఇన్ని వివాదాల మధ్య బిగ్ బాస్ 3 ఏమౌతుందో చూడాలి.

Exit mobile version