ఈమధ్య కాలంలో వచ్చిన హీరో పాత్రల్లో పూరి జగన్నాథ్ సృష్టించిన ఇస్మార్ట్ శంకర్ పాత్ర బాగా ఆకట్టుకుంది. సినిమా చూసిన ప్రేక్షకులు అందరూ హీరో పాత్రకు బాగా కనెక్ట్ అయ్యారు. ఈమధ్య కాలంలో అంతటి మాస్ క్యారెక్టర్ రాలేదని, పూరి గొప్పగా డిజైన్ చేశారని, ఇక రామ్ నటనను పొగడని వారులేరు.
ఇక తాజాగా చిత్రాన్ని వీక్షించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయితే రామ్ నటనకు ఫిదా అయిపోయాడు. రామ్ గొప్పగా నటించాడని సోషల్ మీడియా ద్వారా పొగిడేశారు. పూరిని సైతం మెచ్చుకున్నారు. ఇకపోతే ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 29 కోట్ల షేర్ రాబట్టి రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమాతో రామ్ సంపూర్నమైన మాస్ ఇమేజ్ సంపాదించుకున్నాడు.
Energetic performances by Ram and all the other actors of iSmart Shankar. . CONGRATULATIONS to Puri Garu – the man who put it all together..
Posted by Ram Charan on Thursday, July 25, 2019
