బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమైన అయ్యగారి 100 కోట్ల బొమ్మ!

అక్కినేని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం ‘లెనిన్’ తన కెరీర్ లో సాలిడ్ కంబ్యాక్ హిట్ సినిమా గానే నిలవడం కాకుండా తన కెరీర్ మొదటి 100 కోట్ల సినిమాగా కూడా నిలిచి అదరగొట్టింది.

ఇక థియేటర్స్ నుంచి రీసెంట్ గానే ఓటిటిలోకి కూడా వచ్చిన ఈ సినిమా అక్కడా మంచి రెస్పాన్స్ అందుకుంది. మరి ఎట్టకేలకి వీటి తర్వాత బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యింది లెనిన్. ఈ సినిమా శాటిలైట్ హక్కులు జీ తెలుగు వారు సొంతం చేసుకోగా వారు దీని తాలూకా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ రిలీజ్ డేట్ ని లాక్ చేశారు.

దీనితో లెనిన్ ఈ ఆగష్టు 30 న సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకి ప్రసారం కానున్నట్టు ఖరారు చేశారు. సో ఈ చిత్రానికి అక్కడ ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందించగా నాగవంశీ, అక్కినేని నాగార్జున నిర్మాణం వహించారు.

Exit mobile version