షూటింగ్ లో ‘ఆత్రేయపురం ఆణిముత్యం’ !

athreyapuram

షకలక శంకర్ హీరోగా, రీతూ భర్మెచా హీరోయిన్ గా “ది వన్ ఎంటర్ టైన్మెంట్స్” బ్యానర్ పై ఎం.యస్. రెడ్డి నిర్మిస్తూ, దర్శకత్వం వ‌హిస్తోన్న చిత్రం “ఆత్రేయపురం ఆణిముత్యం ” పూజా కార్ర్యక్రమాలు లాంఛనంగా ఫిల్మ్ నగర్ రామానాయుడు స్టూడియో లో ప్రారంభమైయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో హీరో షకలక శంకర్ మాట్లాడుతూ…“ఆత్రేయపురం ఆణిముత్యం నా మార్క్ కామెడీ చిత్రం. ఎమ్మెస్ రెడ్డిగారు మంచి క‌థ‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. క‌చ్చితంగా అంద‌ర్నీ ఎంట‌ర్ టైన్ చేస్తుంది అన్నారు.

చిత్ర ద‌ర్శ‌క నిర్మాత ఎం.యస్. రెడ్డి మాట్లాడుతూ… ఆత్రేయపురంలో రాజు అనే యువకుడి చుట్టూ తిరిగే కుటుంబ హాస్య చిత్రం ఇది. సమాజంలో జరిగే ఉమెన్ హ‌రాష్‌మెంట్ గురించి చ‌ర్చిస్తున్నాం. ఆత్రేయపురం పరిసర ప్రాంతంలో మరియు హైదరాబాద్ లో చిత్రీకరించబోతున్నాం. మా ఆత్రేయ‌పురం ఆణిముత్యం అంద‌ర్నీ అల‌రిస్తాడు అన్నారు. ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో సంగీత ద‌ర్శ‌కుడు వెంగి, డియ‌స్ రావు, రీతూ భ‌ర్మెచా త‌దిత‌రులు పాల్గొన్నారు.

Exit mobile version