బాలీవుడ్ సినిమా దగ్గర ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ చిత్రమే “ధురంధర్ 2”. టాలెంటెడ్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా దర్శకుడు ఆదిత్య ధర్ కాంబినేషన్ లో చేసిన ఈ సాలిడ్ స్పై యాక్షన్ చిత్రం సీక్వెల్ పై ఎనలేని అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతున్న ఈ సినిమా గ్రాండ్ గా ఈ మార్చ్ 19న వస్తున్నట్టు ఖరారు అయ్యింది.
కానీ మధ్యలో మేకర్స్ మౌనం అనేక అనుమానాలకు దారి తీసింది. దీనితో టాక్సిక్ తో పాటుగా ఈ సినిమా కూడా వాయిదా అన్నట్టు పలు రూమర్స్ వచ్చాయి. పైగా ట్రైలర్ డేట్ పై కూడా ఎలాంటి క్లారిటీ లేకపోవడం మరో మైనస్ అయ్యింది. కానీ ఫైనల్ గా మేకర్స్ సినిమా ట్రైలర్ డేట్ తో పాటుగా సినిమా రిలీజ్ పై కూడా క్లారిటీ ఇచ్చేసారు.
దీనితో ధురంధర్ 2 ట్రైలర్ రేపే అంటే ఈ మార్చ్ 7న ఉదయం 11 గంటల 1 నిమిషానికి విడుదల చేస్తున్నట్టు ఖరారు చేశారు. అలాగే థియేటర్స్ లో అనుకున్న డేట్ అంటే మార్చ్ 19నే ఈ సినిమా గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేస్తున్నట్టు ఖరారు చేశారు. సో అభిమానులకి ఒక క్లారిటీ వచ్చినట్టే అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో సారా అర్జున్ హీరోయిన్ గా నటించగా జియో స్టూడియోస్ బి 62 స్టూడియోస్ వారు నిర్మాణం వహించారు.
Brace yourself ⚔️
Trailer out tomorrow 7th March at 11:01 AM#DhurandharTheRevenge Releasing In Cinemas Worldwide on 19th March 2026 in Hindi, Telugu, Tamil, Kannada & Malayalam@rampalarjun @duttsanjay @ActorMadhavan #AkshayeKhanna #SaraArjun @bolbedibol @AdityaDharFilms… pic.twitter.com/RECbmOcODQ
— Ranveer Singh (@RanveerOfficial) March 6, 2026
