నటుడు శివప్రసాద్ కన్నుమూత…!

Siva Prasad1

నటుడు దర్శకుడు టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ నరమల్లి శివప్రసాద్ 68 నేడు తుదిశ్వాస విడిచారు. గత కొద్దీ రోజుల నుండి అయన ఆరోగ్యం బాగాలేకపోవటంతో చైన్నై అపోలో హాస్పెటల్ లో చికిత్స పొందుతూ నేటి మధ్యాహ్నం కన్నుమూశారు. నటుడిగా, దర్శకుడిగా, రాజకీయ నాయకుడిగా అయన అందరికి సుపరిచితం.

1951 జులై 11 న చిత్తూరు జిల్లాలోని పొట్టిపల్లి లో శివప్రసాద్ జన్మించాడు. మొదటి నుండి నాటకాలు అంటే ఇష్టంతో సినిమాలోకి వచ్చాడు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ తరపున 1999 నుండి 2004 వరకు సత్యవేడు ఎమ్మెల్యేగా పనిచేశాడు. 1999 -2001 మధ్య రాష్ట్ర సమాచార , సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశాడు. 2009 ,2014 లో చిత్తూరు లోక్ సభ నుండి ఎంపీగా ఎన్నికయ్యాడు. రాజకీయాల్లో బిజీ బిజీ గా ఉన్న కానీ సినిమాలకి మాత్రం దూరం కాలేదు.

దూసుకెళ్తా, మస్కా,ఆటాడిస్తా, తులసి, ఒక్క మగడు, కుబేరులు, కితకితలు, లాంటి అనేక సినిమాల్ నటించాడు. ప్రేమ తపస్సు, టోపీ రాజా-స్వీటీ రోజా , కొక్కొరోకో ఇల్లాలు వంటి సినిమాకి దర్శకత్వం వహించాడు. పార్లమెంట్ లో ప్రత్యేక హోదా కోసం పట్టు పడుతూ రోజుకో వేషం వేసుకొని వచ్చి జాతీయ మీడియాలో కూడా పాపులర్ అయ్యాడు. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, జైట్లీ లాంటి ప్రముఖులు కూడా శివ ప్రసాద్ దగ్గరకి వచ్చి గెటప్ బాగుందని మెచ్చుకునే వాళ్ళు. శివప్రసాద్ కి భార్య విజయలక్మి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Exit mobile version