వైరల్ వీడియో: కూతురి చేయి పట్టి కన్నీటి పర్యంతమైన బండ్ల గణేష్!

మన టాలీవుడ్ లో ప్రముఖ నటుడు అలాగే ప్రముఖ నిర్మాత కూడా అయినటువంటి బండ్ల గణేష్ ఇంట ఇపుడు పెళ్లి భాజాలతో సందడిగా నెలకొన్న సంగతి తెలిసిందే. తన వారసురాలు జనని వివాహ వేడుకని అత్యంత ఘనంగా బండ్ల గణేష్ చేయడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చగా మారింది.

మెగాస్టార్ చిరంజీవి, సీఎం రేవంత్ రెడ్డి లాంటి దిగ్గజాలు హాజరైన ఈ పెళ్లి కోసమే అంతా మాట్లాకుంటుండగా ఓ ఎమోషనల్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. బండ్ల గణేష్ ఎంత నటుడు, నిర్మాత పేరు మోసిన వ్యాపారవేత్త అయినా తాను కూడా ఒక ఆడపిల్లకి తండ్రే ఆ మమకారం ఇపుడు తనని కన్నీటి పర్యంతం చేసింది.

కూతురుని అత్తారింటికి పంపుతూ కూతురి చేయి పట్టుకొని బండ్ల గణేష్ విలపించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. తన ఆవేదన చూసి మెగాస్టార్ కూడా ఓదార్చారు. దీనితో ఈ క్లిప్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతోంది.

Exit mobile version