అక్కినేని నాగార్జున సూపర్ హిట్ సినిమాల్లో ‘సోగ్గాడే చిన్నినాయన’ కూడా ఒకటి. 2015 లో విడుదలైన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుని భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో నాగార్జున చేసిన బంగార్రాజు పాత్రకు విశేషమైన స్పందన లభించింది. దీంతో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, నాగార్జున – నాగ చైతన్య కాంబినేషన్ లో ఆ చిత్రానికి సీక్వెల్ తీయబోతున్న సంగతి తెలిసిందే. కాగా కళ్యాణ్ కృష్ణ, ఈ చిత్ర సంగీత దర్శకుడు అనుప్ రూబెన్స్‌తో పాటు సాంగ్స్ కంపోజిషన్స్ లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే బంగార్రాజు సినిమా స్క్రిప్ట్ పనులు ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయట. నవంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సోదరుడు మరణం కారణంగా సినిమా పనులు కొన్నాళ్ళు వాయిదా పడ్డాయి. పైగా ప్రస్తుతం నాగ్, ‘బిగ్ బాస్-3’తో బిజీగా ఉన్నాడు. దాంతో అనుకున్న సమయానికి బంగార్రాజు సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఇక నవంబర్ లో ఈ సినిమాను మొదలుపెట్టి, వచ్చే ఏడాదే వేసవిలో బంగార్రాజుని విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.
