అమితాబ్ అమూల్యమైన సలహాని పెడచెవిన పెట్టిన చిరు

Amitabh Bachchan

ప్రస్తుతం సైరా టీం ప్రొమోషన్స్ లో బిజీగా ఉన్నారు. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో నిన్న ముంబై వెళ్లిన చిరు.., అమితాబ్, పర్హాన్ అక్తర్ తో కలిసి అక్కడ ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. హిందీలో కూడా సైరా విడుదల అవుతున్న కారణంగా ఆయన నిన్న అక్కడ వెళ్లడం జరిగింది. ఇక నేడు నిర్మాత రామ్ చరణ్, నటి తమన్నా తో కలిసి చిరంజీవి చెన్నై వెళ్లారు. చెన్నైలో పాత్రికేయుల సమావేశంలో పాల్గొనడం జరిగింది. అయితే ముంబై వెళ్లిన చిరును, అమితాబ్‌తో కలిపి ఫర్హాన్‌ అక్తర్‌ ఓ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ఇరువురు పలు ఆసక్తికర సంఘటలను వెల్లడించారు.

చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్తానని చెప్పినప్పుడు తాను వద్దని వారించినా.. తన మాట వినలేదని అమితాబ్‌ చెప్పుకొచ్చాడు. అమితాబ్‌ చెబితే వినలేదు.. వెళ్లాను.. బాధపడ్డానంటూ చిరు బదులిచ్చాడు. ఇదే సలహాను రజనీకాంత్‌కు కూడా ఇచ్చాను కానీ ఆయన కూడా వినలేదంటూ అమితాబ్‌ వెల్లడించాడు. బిగ్‌బీ అమితాబ్‌, విజయ్‌ సేతుపతి, కిచ్చా సుదీప్‌, నయన తార, తమన్నా, జగపతి బాబు లాంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version