సూపర్‌స్టార్ రజినీకాంత్ చిత్రసీమలోకి అడుగుపెట్టి 51 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ధర్మన్’ సెట్స్ లో మూవీ టీమ్ ఘనంగా సెలెబ్రేట్ చేసుకున్నారు. దర్శకుడు అశ్విత్ మరిముత్తు తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కమల్ హాసన్ ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఈ భారీ యాక్షన్ డ్రామాలో ఐకానిక్ నటి సిమ్రాన్, రాశి ఖన్నా మరియు యోగి బాబు కీలక పాత్రల్లో నటిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ బాణీలు అందిస్తున్నారు. అన్బరివ్ మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ తోడవ్వడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఐదు దశాబ్దాలకు పైగా చెక్కుచెదరని మాస్ ఇమేజ్‌తో కోట్లాది మంది అభిమానులను ఏలుతున్న రజినీకాంత్ 51 సంవత్సరాల సినీ ప్రస్థానాన్ని సంబరంగా జరుపుకుంటూ మేకర్స్ షేర్ చేసిన ఈ స్పెషల్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
51 YEARS
ONE NAME
ONE SUPERSTARCelebrating from the sets of DHARMAN 🔥#Dharman #KettaPaiyanSir #SuperstarRajinikanth #KamalHaasan @rajinikanth @ikamalhaasan #Mahendran @Dir_Ashwath @anirudhofficial @anbariv @iYogiBabu @SimranbaggaOffc #RaashiKhanna @nikethbommi… pic.twitter.com/EGfxbNGRtQ
— Raaj Kamal Films International (@RKFI) August 15, 2026
