మనిషి అవసరాలు, ఆడంబరాలు అంతకంతకు పర్యావణ నాశనాన్ని పెచుకుంటూ పోతున్నాయి. ఇప్పటికే ప్లాస్టిక్ అత్యంత క్లిష్టమైన సమస్యగా మారి పర్యావరణాన్ని హరిస్తుంటే…,కోనేళ్ళుగా బ్యానర్స్ మరో ప్రకృతి హేతువులుగా మారాయి. పల్లెలనుండి పట్టణాల వరకు బ్యానర్స్ సంస్కృతి పాకి అనేక సమస్యలకు కారణం అవుతుంది. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ సంఘటన అందరిని దిగ్బ్రాంతికి గురిచేసింది. ఓ పొలిటికల్ బ్యానర్ కారణంగా ఓ యువతి ప్రమాదానికి గురై మరణించడం జరిగింది. ఈ సంఘట జరిగినప్పటినుండీ తమిళ స్టార్ హీరోలు బ్యానర్స్ కల్చర్ కి స్వస్తి చెప్పాలని పిలుపునిచ్చారు.
విజయ్, అజిత్, కమల్, రజిని, సూర్య వంటి హీరోలు తమ సినిమాలకు సంబంధించిన ఏ కార్యక్రమానికైనా బ్యానర్స్ కట్టొద్దని, ఆ డబ్బులతో ఎంతో కొంత సామజిక సేవకు ఉపయోగపడే పనులు చేయాలని తమ అభిమానులకు సూచించారు. దీనితో కొంతలో కొంత అక్కడ ఫ్యాన్స్ లో మార్పు వచ్చినట్లు తెలుస్తుంది. ఇక మన హీరోలు ఈ విషయం పై స్పందించక పోవడం గమనార్హం.
ఇటీవల విడుదలైన సాహో మరియు గ్యాంగ్ లీడర్ గద్దలకొండ గణేష్ వంటి చిత్రాలకు అభిమానులు థియేటర్ల దగ్గర, పబ్లిక్ ప్రదేశాలలో భారీ ఎత్తున బ్యానర్స్ ఏర్పాటు చేసి తమ అభిమానం తెలుపుకున్నారు. ఇక నేడు విడుదలైన సైరా సంగతి సరే సరి.చాలా ప్రదేశాలో రోడ్ల వెంబడి బారులుగా ఈ చిత్ర బ్యానర్స్ ఏర్పాటు చేశారు మెగా అభిమానులు. సమాజంలో పాపులారిటీ ఉన్న స్టార్ హీరోలు పర్యావరణానికి హానిచేయడమే కాకూండా , ప్రమాదాలకు కారణం అవుతున్న ఇలాంటి విష సంస్కృతికి స్వస్తి చెప్పేలా అభిమానులకు పిలుపునిస్తే మంచిది.
