హీరోయిన్ మాళవిక మోహన్ బంపర్ ఆఫర్ అందుకుంది. ఏకంగా తలపతి విజయ్ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంది. 2013లో విడుదలైన పాట్టం పోలె అనే మలయాళ చిత్రంతో వెండి తెరకు పరిచయమైన ఈ భామ ఇంత వరకు ఒక స్థాయి హీరో చిత్రంలో ప్రాముఖ్యం ఉన్న పాత్ర చేసిన దాఖలాలు లేవు. అలాంటిది ఈ సారి విజయ్ మూవీలో నటించే అవకాశం దక్కించుకుంది. మరి ఈ మూవీలో మాళవిక పాత్ర ఏంటనేది ఇంకా తెలియదు. ఒక వేళ విజయ్ సరసన సెకండ్ హీరోయిన్ గా అవకాశం దక్కినా ఆమె పంట పండినట్లే.
ఇక విజయ్ 64వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా కనిపిస్తుండగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. నేడు అధికారికంగా మొదలైన ఈ చిత్ర షూటింగ్ త్వరలో మొదలుకానుంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల కానుంది.
