ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తెరకెక్కించిన సైరా విడుదలై ప్రేక్షక ఆదరణ దక్కించుకుంటుంది. అన్నివర్గాల ప్రేక్షకులు సైరా చిత్రానికి బ్రహ్మరధం పడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అద్భుతంగా నటించడంతో పాటు, దర్శకుడు సురేంధర్ రెడ్డి దర్శకత్వ ప్రతిభ, రామ్ చరణ్ నిర్మాణ విలువలు,అద్భుత క్యాస్టింగ్ మొత్తం వెరసి సైరా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.
ఈ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు తెలుపుతూ నిన్న చిత్ర యూనిట్ మీడియా సమక్షంలో ఒక వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి, రామ్ చరణ్ లతో పాటుగా దర్శకుడు సురేంధర్ రెడ్డి, నటుడు జగపతి బాబు, తమన్నా, సీనియర్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్, సాయి మాధవ్ బుర్రా, రత్నవేలు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ 2004లో ఈమూవీ చేయాలనే ఆలోచనకు భీజం పడ్డాక, చిరంజీవితో చిత్రం చేయాలని ప్రయత్నాలు సాగుతున్నప్పుడు ఆయన 2008లో రాజకీయాలవైపు వెళ్లిపోయారు. రాజకీయాలలో బిజీగా ఉన్న చిరు వారితో నాతో కాకున్నా, చరణ్ తో ఈ మూవీ చేద్దాం అని వారికి చెప్పారట. ఒక వేళా చిరంజీవి రాజకీయాలకు స్వస్తి చెప్పకుండా, మళ్ళీ సినిమాలు చేయకుండా ఉంటే సైరా నరసింహారెడ్డి గా చరణ్ ని చూశేవాళ్ళం అన్న మాట.
